కొవిడ్‌ పరీక్షలు ఏది?ఎలా?ఎందుకు?

కొవిడ్‌-19 ఇప్పుడప్పుడే మనల్ని వదిలేది కాదు. దీని నిర్ధరణకు పరీక్షల అవసరమూ తప్పేదీ కాదు. ఇందుకోసం ప్రధానంగా మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే. దేని బలాలు, బలహీనతలు దానివే. ఏది, ఎప్పుడు, ఎలా చేస్తారో తెలుసుకొని ఉండటం మంచిది.

Updated : 28 Dec 2021 04:53 IST

కొవిడ్‌-19 ఇప్పుడప్పుడే మనల్ని వదిలేది కాదు. దీని నిర్ధరణకు పరీక్షల అవసరమూ తప్పేదీ కాదు. ఇందుకోసం ప్రధానంగా మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే. దేని బలాలు, బలహీనతలు దానివే. ఏది, ఎప్పుడు, ఎలా చేస్తారో తెలుసుకొని ఉండటం మంచిది.


మాలిక్యులర్‌ పరీక్ష (ఉదా: పీసీఆర్‌). వైరస్‌ భాగాలను (ముల్లు ప్రొటీన్‌ వంటివి) గుర్తిస్తుంది.

నమూనా

* గొంతు వెనకాల లేదా ముక్కులో దూది పుల్లతో స్రావాన్ని సేకరిస్తారు.
పాత్ర

* కొవిడ్‌ నిర్ధరణకు అత్యంత కచ్చితమైన, స్పష్టమైన పద్ధతి ఇది. వైరస్‌ తక్కువ సంఖ్యలో ఉన్నా బయటపడుతుంది.

బలాలు

* కచ్చితత్వం అధికం

బలహీనతలు

* యాంటిజెన్‌ పరీక్ష కన్నా నెమ్మదైనది. ఫలితాలు రావటానికి 24-48 గంటలు పడుతుంది.

* పరీక్ష చేయటానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.

* ఇతర పరీక్షల కన్నా ఖరీదైనది. (కొన్నిచోట్ల చవకగానూ అందుబాటులో ఉంది)

* ఇన్‌ఫెక్షన్‌ దశ దాటిన తర్వాత కూడా పాజిటివ్‌ ఫలితాలు రావొచ్చు.


యాంటీజెన్‌ పరీక్షలు(ఉదా: లాటెరల్‌ ఫ్లో పరీక్షలు).వైరస్‌ ప్రొటీన్లను గుర్తిస్తుంది.

నమూనా

* గొంతు వెనకాల లేదా ముక్కులో దూది పుల్లతో స్రావాన్ని సేకరిస్తారు.

పాత్ర

* ఇన్‌ఫెక్షన్‌ వ్యాపింపజేసే అవకాశం గలవారిలో త్వరగా వైరస్‌ను గుర్తిస్తుంది. కానీ వైరస్‌ సంఖ్య తక్కువగా ఉంటే గుర్తించలేదు.

బలాలు

* వేగంగా.. 15-20 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడతాయి.

* మామూలు శిక్షణతో ప్రయోగశాలల బయట కూడా చేయొచ్చు.

* పీసీఆర్‌ పరీక్ష కన్నా చవక.  

* పెద్ద మొత్తంలో తయారుచేయటం తేలిక.

బలహీనతలు

* మాలిక్యులర్‌ పరీక్ష మాదిరిగా అంత కచ్చితమైంది కాదు. నెగెటివ్‌ ఫలితం వచ్చినప్పుడు నిర్ధరణకు పీసీఆర్‌ గానీ మరోసారి యాంటీజెన్‌ పరీక్ష గానీ చేయాల్సి ఉంటుంది.


సీరాలజీ పరీక్షలు (యాంటీబాడీ పరీక్షలు). ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీలను గుర్తిస్తుంది.

నమూనా

* రక్తం

పాత్ర

* గత ఇన్‌ఫెక్షన్‌ను సూచిస్తుంది. లక్షణాలు  ఆరంభమయ్యాక 2 వారాలు దాటాక ఉపయోగపడుతుంది.

బలాలు

* గతంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్టు నిర్ధరిస్తుంది.

బలహీనతలు

* కచ్చితమైంది కాదు. యాంటీబాడీలు లేకపోయినా ఉన్నట్టు ఫలితం రావొచ్చు. రోగనిరోధక శక్తి సహజ ఇన్‌ఫెక్షన్‌తో పుట్టుకొచ్చిందా? టీకాలతోనా? అనేది గుర్తించలేదు.

* కొన్నిసార్లు జబ్బు ఉన్నా లేనట్టు (ఫాల్స్‌ నెగెటివ్‌) చూపించొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వచ్చాక లేదా టీకా తీసుకున్న తర్వాత కూడా ఫాల్స్‌ నెగెటివ్‌ ఫలితం రావొచ్చు.

* చికిత్స లేదా రోగనిరోధక శక్తి రుజువు విషయంలో దీని పాత్ర పరిమితం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని