కళ్లద్దాలకు చెల్లు!

చత్వారం గలవారు కళ్లద్దాలు ధరిస్తే గానీ అక్షరాల వంటివి కనిపించవు. మరి కళ్లద్దాలతో పనిలేకుండా చుక్కల మందుతోనే చూపు స్పష్టంగా కనిపిస్తే? అమెరికా కంపెనీ ఒకటి అలాంటి చుక్కల మందునే తయారుచేసింది. దీనికి ఇటీవల అక్కడి ఎఫ్‌డీఏ అనుమతీ లభించింది.

Updated : 04 Jan 2022 03:02 IST

త్వారం గలవారు కళ్లద్దాలు ధరిస్తే గానీ అక్షరాల వంటివి కనిపించవు. మరి కళ్లద్దాలతో పనిలేకుండా చుక్కల మందుతోనే చూపు స్పష్టంగా కనిపిస్తే? అమెరికా కంపెనీ ఒకటి అలాంటి చుక్కల మందునే తయారుచేసింది. దీనికి ఇటీవల అక్కడి ఎఫ్‌డీఏ అనుమతీ లభించింది. కంట్లో వీటిని వేసుకున్నాక 15 నిమిషాల తర్వాత ప్రభావం మొదలవుతుంది. సుమారు 6 నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది. చుక్కలు వేసుకుంటే చూపు ఎలా స్పష్టంగా అవుతుందని సందేహిస్తున్నారా? ఇవి కంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని కనుపాప సైజును తగ్గిస్తాయి. కనుపాప సైజు తగ్గితే చూపు కేంద్రీకృతం కావటం మెరుగవుతుంది. ఇది వివిధ కోణాల్లో చూపు కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. ఈ చుక్కల మందు 65 ఏళ్ల లోపువారిలో ఇంకాస్త బాగా పనిచేస్తున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. కాకపోతే ధర ఎక్కువ. కొందరికి తలనొప్పి, కళ్లు ఎర్రబడటం వంటి దుష్ప్రభావాలూ తలెత్తుతున్నట్టు బయటపడింది. చుక్కల మందుతో పోలిస్తే కళ్లద్దాలు చవకే అయినా చిన్న వయసువారికి, కళ్లద్దాలు ధరించటం ఇష్టంలేనివారికి ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని