కిడ్నీలకు పురుగు మందు దెబ్బ

పంటలకు పురుగుమందులు కొడుతున్నారా? కాస్త జాగ్రత్త. మలాథియాన్‌ అనే మందుతో దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ పరిశోధకులు గుర్తించారు.

Updated : 04 Jan 2022 03:02 IST

పంటలకు పురుగుమందులు కొడుతున్నారా? కాస్త జాగ్రత్త. మలాథియాన్‌ అనే మందుతో దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాల కిడ్నీ జబ్బుకు వయసు మీద పడటం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు దోహదం చేస్తుంటాయి. అయితే చాలామందిలో కారణాలేవీ లేకుండానూ దీని ముప్పు పెరుగుతుండటంతో పరిశోధకులు వివిధ అంశాలపై ఆరా తీశారు. మొదట్లో పొలాలు, చెలకల్లో వేడికి గురికావటం, ఒంట్లో నీటి శాతం తగ్గటం, పురుగు మందులు చల్లటం, భార లోహాలు, వ్యవసాయ రసాయనాలు సీకేడీకి కారణమవుతుండొచ్చని అనుమానించారు. అయితే పురుగుమందుల అవశేషాలు, భార లోహాలతో కూడిన మూలిక ఔషధాలు సైతం దోహదం చేస్తున్నట్టు గుర్తించారు. కారణమేంటన్నది తెలియరాలేదు కానీ పీపీఈ కిట్ల వంటివి ధరించకుండా పురుగుమందులు చల్లటం, వీటి అవశేషాలతో కూడిన మట్టిలో పనిచేయటం దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అందువల్ల పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా చూసుకోవటం ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు. స్వల్పంగా వీటి ప్రభావానికి గురైనా దీర్ఘకాలంలో విపరీత ఫలితం కనిపించొచ్చని హెచ్చరిస్తున్నారు. పొలాల్లో మలాథియాన్‌ విరివిగా చల్లుతుంటారు. దోమల నివారణకు బహిరంగ ప్రాంతాల్లోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు