కొవిడ్‌కు ఫ్లూ టీకా కళ్లెం

ఫ్లూ టీకాను మనం పెద్దగా పట్టించుకోం గానీ.. ఇది కొవిడ్‌-19 కొంతవరకు తీవ్రం కాకుండానూ కాపాడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు

Published : 18 Jan 2022 00:26 IST

ఫ్లూ టీకాను మనం పెద్దగా పట్టించుకోం గానీ.. ఇది కొవిడ్‌-19 కొంతవరకు తీవ్రం కాకుండానూ కాపాడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 75వేల మంది కొవిడ్‌ బాధితులను పరిశీలించి, ఈ విషయాన్ని గుర్తించారు. ఫ్లూ టీకా వేయించుకున్నవారికి కొవిడ్‌ మూలంగా తలెత్తే పక్షవాతం, ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి విస్తరించటం, కాలి సిరల్లో రక్తం గడ్డల ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఫ్లూ టీకా కొవిడ్‌ నుంచి ఎలా రక్షణ కల్పిస్తుందన్నది కచ్చితంగా తెలియదు కానీ ఇది సహజ (ఇన్నేట్‌) రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని భావిస్తున్నారు. మనకు పుట్టుకతోనే సంక్రమించే సహజ రోగనిరోధక శక్తి అన్నిరకాల వ్యాధి కారకాల నుంచి కాపాడుతుంది. రోగనిరోధక ప్రతిస్పందనలో మొట్టమొదటి రక్షణ కవచం ఇదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని