నీరు తగ్గినా తరచూ మూత్రం!

నీరు, ద్రవాలు అధికంగా తీసుకున్నప్పుడు ఎక్కువసార్లు మూత్రం రావటం మామూలే. అయితే కొన్నిసార్లు ఒంట్లో నీటిశాతం తగ్గినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని తెలుసా? నమ్మబుద్ధి కావటం

Updated : 08 Feb 2022 06:05 IST

నీరు, ద్రవాలు అధికంగా తీసుకున్నప్పుడు ఎక్కువసార్లు మూత్రం రావటం మామూలే. అయితే కొన్నిసార్లు ఒంట్లో నీటిశాతం తగ్గినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని తెలుసా? నమ్మబుద్ధి కావటం లేదు కదా. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు మూత్రం చిక్కబడుతుంది. దీంతో మూత్రంలోని లవణాలు, రసాయనాల గాఢత కూడా పెరుగుతుంది. అప్పుడు ఇవన్నీ మూత్రాశయం గోడలను చికాకు పరుస్తుంటాయి. ఫలితంగా మూత్రం వస్తున్న భావన కలుగుతుంది. ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. నీరు ఎక్కువగా తాగినా తరచూ మూత్రం వస్తుందనుకోండి. మరి మూత్రం ఎందుకు ఎక్కువగా వస్తోంది? నీటిశాతం తగ్గటం వల్లనా? ఎక్కువవటం వల్లనా? మూత్రం రంగుతో దీన్ని ఇట్టే గుర్తించొచ్చు. తగినంత నీరు తాగితే మూత్రం లేత పసుపు రంగులో వస్తుంది. అదే ముదురు పసుపు రంగులో వస్తుంటే నీటి శాతం తగ్గిందనే అర్థం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు