షిఫ్ట్‌ అనర్థాలకు దూరంగా..

రాత్రి షిఫ్ట్‌ ఉద్యోగుల్లో నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా మధుమేహం, గుండెజబ్బు, ఊబకాయం ముప్పులు పెరుగుతాయి. షిఫ్ట్‌ ఉద్యోగులు రాత్రి ఆలస్యంగా తింటుంటారు. 

Updated : 22 Feb 2022 06:47 IST

రాత్రి షిఫ్ట్‌ ఉద్యోగుల్లో నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా మధుమేహం, గుండెజబ్బు, ఊబకాయం ముప్పులు పెరుగుతాయి. షిఫ్ట్‌ ఉద్యోగులు రాత్రి ఆలస్యంగా తింటుంటారు.  దీంతో జీవక్రియలు మారిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణ సామర్థ్యం తగ్గుతుంది. అయితే రాత్రివేళ భోజనం చేయకపోతే.. అంటే భోజన వేళలను పగటి పూటకే పరిమితం చేసుకుంటే దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశముందని తాజా అధ్యయనం వివరిస్తోంది. ముఖ్యంగా షిఫ్ట్‌ వేళలతో ముడిపడిన అధిక గ్లూకోజును నివారించుకోవచ్చని చెబుతోంది. అధ్యయనంలో భాగంగా కొందరికి మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనం చేయాలని.. మరికొందరికి పగటి వేళల్లోనే రెండు పూటల భోజనం ముగించాలని పరిశోధకులు సూచించారు. రాత్రి భోజనం చేసినవారిలో సగటున 6.4% ఎక్కువగా గ్లూకోజు మోతాదులు పెరుగుతుండటం గమనార్హం. రక్తంలో గ్లూకోజు మోతాదుల హెచ్చుతగ్గుల్లో భోజన వేళలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని ఇది మరోసారి బలపరిచింది. రాత్రి షిఫ్ట్‌లో పనిచేసేవారి విషయంలో ఇది మరింత ప్రభావాన్ని చూపిస్తున్నట్టు నొక్కి చెప్పింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని