కాలేయ జబ్బుతో ఎముక క్షీణత

ఒంట్లో జీవక్రియలకు కాలేయమే కేంద్రం. ఇది దెబ్బతింటే జీవక్రియతో ముడిపడిన ఎముక క్షీణతకూ (హెపాటిక్‌ ఆస్టియోడిస్ట్రొఫీ డిసీజ్‌- హెచ్‌ఓడీ) దారితీస్తుంది. దీని బారినపడ్డవారిలో ఎముకలు విరిగితే త్వరగా అతుక్కోవు.

Published : 08 Mar 2022 00:57 IST

ఒంట్లో జీవక్రియలకు కాలేయమే కేంద్రం. ఇది దెబ్బతింటే జీవక్రియతో ముడిపడిన ఎముక క్షీణతకూ (హెపాటిక్‌ ఆస్టియోడిస్ట్రొఫీ డిసీజ్‌- హెచ్‌ఓడీ) దారితీస్తుంది. దీని బారినపడ్డవారిలో ఎముకలు విరిగితే త్వరగా అతుక్కోవు. అందుకే హెచ్‌ఓడీకి దారితీస్తున్న కణ యంత్రాంగాన్ని గుర్తించటంపై చైనా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. సాధారణంగా ఎల్‌సీఏటీ అనే ఎంజైమ్‌ ఎముక కణజాలం నుంచి కాలేయానికి కొవ్వును వెనక్కి చేరవేస్తూ ఎముక జీవక్రియను నియంత్రిస్తుంది. హెచ్‌ఓడీ గలవారిలో దీని పనితీరు మందగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాలేయంలో పీపీ2ఏసీఏ జన్యువు అతిగా వ్యక్తమయ్యేలా చేస్తే ఎముక క్షీణత తగ్గుతున్నట్టూ కనుగొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని