ఆమె హృదయానికి మెనోపాజ్ చిక్కు
మగవారి కన్నా ఆడవారికి గుండెజబ్బు పదేళ్లు ఆలస్యంగా వస్తుంటుంది. దీనికి కారణం నెలసరి సమయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ రక్షణ. ఇది మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరిగేలా, చెడ్డ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బు ముప్పూ తగ్గుతుంది. అయితే నెలసరి నిలిచిన (మెనోపాజ్) తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. అదే సమయంలో ఫాలిక్యుల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్) పెరుగుతుంది. ఈ మార్పులు గుండె ఆరోగ్యం క్షీణించటం మీద నేరుగా ప్రభావం చూపుతున్నట్టు ఫిన్లాండ్ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. నెలసరి నిలిచిన దశలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువవుతున్నట్టు, ఇందులో 10% పెరుగుదలకు స్త్రీ హార్మోన్లలో మార్పులే కారణమవుతున్నట్టు తేలింది. హార్మోన్ భర్తీ చికిత్సతో ఇది కొంతవరకు మెరుగవుతున్నట్టు బయటపడింది. సాధారణంగా మహిళలకు 48-52 ఏళ్ల మధ్యలో రుతుక్రమం నిలిచిపోతుంటుంది. నెలసరి నిలవటం అనివార్యమే అయినప్పటికీ సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం ద్వారా ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. హార్మోన్ భర్తీ చికిత్స తీసుకునే విషయంలో డాక్టర్‌తో చర్చించి, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఆయన చిత్రాల్ని నేను రీమేక్ చేస్తే ఎదురుదెబ్బే: చిరంజీవి
-
General News
Telangana News: 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ
-
Politics News
Nitish Kumar: బిహార్ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా
-
Politics News
Bihar: లాలూ ఉంటేనే బిహార్ నడుస్తుంది..!
-
Politics News
Bandi sanjay: గ్యాస్ ధరలు తగ్గించిన పార్టీకే ఓటేస్తాం: బండి సంజయ్‌కి తేల్చి చెప్పిన గ్రామస్థులు
-
World News
Seoul: సియోల్‌లో కుంభవృష్టి.. ఎనిమిది మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా