ఈ మధుమేహం కొవిడ్‌తో వచ్చిందా?
సమస్య: నాకు ఇటీవల కొవిడ్ వచ్చి, తగ్గింది. తర్వాత మధుమేహం మొదలైంది. ఇది కొవిడ్‌తో వచ్చిందా? లేకపోతే వయసుతో పాటు వచ్చిందా? నాకు అర్థం కావటం లేదు.
- విశ్వ, హైదరాబాద్
సలహా: కొవిడ్ బారినపడ్డవారికి మధుమేహం రావటాన్ని ఇటీవల చూస్తున్నాం. స్టిరాయిడ్ మందులతోనో.. నేరుగా వైరస్ ప్రభావంతోనో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కొవిడ్‌లో శరీరం విపరీతమైన ఒత్తిడికి గురికావటమూ దీనికి దారితీయొచ్చు. కారణమేదైనా మధుమేహం వచ్చిన వెంటనే మందులు వేసుకోవాలి. పెద్ద వయసులో వచ్చే టైప్2 మధుమేహంలో రక్తంలో గ్లూకోజు 125 నుంచి 140 మి.గ్రా. వరకు ఉంటే మందులు అవసరం లేదని ఒకప్పుడు భావించేవాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులోనైనా.. అంతకుముందు కొవిడ్ వచ్చినా, రాకున్నా.. స్టిరాయిడ్ మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటే మందులు వేసుకోవాల్సిందే.
డయాబెటిస్‌లో కాలేయ జబ్బులా?
సమస్య: ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మధుమేహుల్లో కాలేయానికి సంబంధించి ఎలాంటి జబ్బులు వస్తాయి?
- లక్ష్మి, హైదరాబాద్
సలహా: మధుమేహం గలవారిలో గుండెజబ్బుల మాదిరిగానే కాలేయ జబ్బులకూ ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం నియంత్రణలో లేనివారిలో మద్యం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, పిత్తాశయ సమస్యలతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు పదార్థం పేరుకుపోతుంది (ఫ్యాటీ లివర్). గతంలో అల్ట్రాసౌండ్ పరీక్షలు అంతగా చేసేవారు కాదు కాబట్టి దీని గురించి తెలిసేది కాదు. ఇప్పుడు తరచూ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో మధుమేహుల్లో కాలేయానికి కొవ్వు పడుతున్నట్టు బయటపడుతోంది. ఇది వాపు ప్రక్రియను ప్రేరేపించి కాలేయంలోని కణజాలం గట్టిపడేలా చేస్తుంది కూడా. ఇది క్రమంగా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. మంచి విషయం ఏంటంటే- కాలేయంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించుకునే వీలుండటం. సాధారణంగా మధుమేహ దుష్ప్రభావాలు మొదలైతే వెనక్కి మళ్లించటం అసాధ్యం. కానీ ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించటం, బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా కాలేయ కొవ్వును తగ్గించుకోవచ్చు. బరువును 15% తగ్గించుకోగలిగితే కాలేయ కొవ్వు సమస్యను వెనక్కి మళ్లించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పయోగ్లిటజోన్, సెమాగ్లుటైడ్ వంటి మందులతోనూ ఫ్యాటీ లివర్ తగ్గుతున్నట్టు బయటపడింది.
మీ సమస్యలను పంపాల్సిన ఈమెయిల్ చిరునామా: sukhi@eenadu.in
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Tax on petrol diesel exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను
-
Crime News
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
-
Sports News
Jasprit Bumrah: అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
-
India News
Eknath Shinde: కొత్త సీఎంకు అసెంబ్లీలో బలపరీక్ష.. సోమవారానికి గడువు..!
-
General News
TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?