జ్ఞాపకశక్తికీ యాపిల్‌!

యాపిల్‌ అనగానే గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల ముప్పు తగ్గటమే గుర్తుకొస్తుంది. దీనిలో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవన్నీ జబ్బుల నివారణకు ఎంతగానో

Published : 31 May 2022 00:37 IST

యాపిల్‌ అనగానే గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల ముప్పు తగ్గటమే గుర్తుకొస్తుంది. దీనిలో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవన్నీ జబ్బుల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి యాపిల్‌ మతిమరుపు తగ్గటానికీ తోడ్పడుతుందనే సంగతి తెలుసా? ఇందులో విటమిన్‌ బి1, ఫాస్ఫరస్‌, పొటాషియం వంటి పోషకాలెన్నో ఉంటాయి. ఇవి నాడీకణాల క్షీణతను నియంత్రించే గ్లుటమిన్‌ యాసిడ్‌ సంశ్లేషణకు తోడ్పడతాయి. యాపిల్‌ను తేనె, పాలతో తీసుకుంటే మతిమరుపు తగ్గటానికి మందుగానూ పనిచేస్తుంది. ఇది నాడులకు బలాన్నిస్తుంది, కొత్తశక్తిని సమకూరుస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని