ఒత్తిడిపై చిన్నచూపొద్దు!

మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌) అందరూ ఎదుర్కొనేదే. నిజానికి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చాలామందికి తెలియదు కూడా. ఇది కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలకూ దారితీయొచ్చు. ఒత్తిడిని నియంత్రించుకోలేక

Published : 31 May 2022 00:37 IST

మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌) అందరూ ఎదుర్కొనేదే. నిజానికి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చాలామందికి తెలియదు కూడా. ఇది కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలకూ దారితీయొచ్చు. ఒత్తిడిని నియంత్రించుకోలేక పోతున్నామని అనిపిస్తున్నా.. రోజువారీ పనులకు ఆటంకం కలుగుతున్నా.. పనులను తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా సమస్య తీవ్రమవుతోందని, ప్రమాదకరంగా పరిణమిస్తోందనే అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ను సంప్రదించటానికి వెనకాడటం తగదు. కౌన్సెలింగ్‌, మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఆందోళన సమస్యగా మారి అనేక అనర్థాలను తెచ్చిపెడుతుందని మరవరాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని