logo

వర్షాలకు అవకాశం

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో....

Updated : 05 Jul 2022 06:35 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.... తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వివరించారు. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తేనీ, దిండుక్కల్‌ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నైలో రానున్న 48 గంటలకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని