logo

కఠిన నిబంధనలు సాధ్యం కాదు

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు.

Updated : 05 Jul 2022 06:37 IST

ఆరోగ్యశాఖ మంత్రి


ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తున్న మా.సుబ్రమణియన్‌

మహాబలిపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నివారణకు కఠిన నిబంధనలు విధించే పరిస్థితి లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. చెంగల్పట్టు జిల్లా ఇడైక్కళినాడు పట్టణ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ... పలు దేశాల్లో కరోనావిజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 14,504 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థికంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కఠిన నిబంధనలను సీఎం అమలు చేయడం లేదని చెప్పారు. బాధితులకు తగిన చికిత్స అందించడానికి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాధితుల్లో 95 శాతం మంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని వివరించారు.

15 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో సోమవారం 2,654 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చెన్నైలో 1,066 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34,85,429కి చేరింది. బాధితుల్లో కొత్తగా ఎవరూ మరణించలేదు. మొత్తం మరణాల సంఖ్య 38,026గానే ఉంది. రోజు వ్యవధిలో కొత్తగా 1,542 మంది డిశ్చార్జి అయ్యారు. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 34,31,787కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 15,616కు పెరిగింది. పుదుచ్చేరిలో 24గంటల వ్యవధిలో కొత్తగా 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాలేదు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 501కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని