logo

చెన్నైలో ‘రోప్‌కార్‌’కు సన్నాహాలు

చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్‌కార్‌ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్‌ తరఫున గ్రీన్‌ చెన్నై, కల్చరల్‌ చెన్నై, క్లీన్‌ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్‌ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు.

Updated : 05 Jul 2022 06:33 IST


రోప్‌కార్‌ నమూనా

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్‌కార్‌ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్‌ తరఫున గ్రీన్‌ చెన్నై, కల్చరల్‌ చెన్నై, క్లీన్‌ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్‌ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా భారీ రంగులరాట్నాలతో కూడిన ఉద్యానాల ఏర్పాటు, సముద్రతీర రహదారుల సుందరీకరణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెన్నై మెరినా సముద్రతీరం తదితర కొన్ని ప్రాంతాలలో రోప్‌కార్‌ వసతిని ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలిసింది. ఇటీవల మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ.. సింగార చెన్నై 2.0 పథకంలో నగరాన్ని సుందరీకరించేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. అనేకమంది కౌన్సిలర్లు స్పందించారు. రోప్‌కార్‌ వసతిని ప్రారంభించవచ్చని కొందరు చెప్పారు.


నేప్పియార్‌ వంతెన

సముద్రతీరంలో.. చెన్నైలో ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్న మెరినా బీచ్‌లో రోప్‌కార్‌ సేవలను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, ఇంజినీర్లు పలు కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా నేప్పియార్‌ వంతెన నుంచి నమ్మ చెన్నై సెల్ఫీ పాయింట్‌ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రారంభించే అవకాశాలున్నాయి. తర్వాత రాయపురం రైల్వేస్టేషన్‌ నుంచి నేప్పియార్‌ వంతెన వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సింగార చెన్నై 2.0 పథకానికిగాను తీసుకుంటున్న నిర్ణయాలు, కొత్త పథకాలు త్వరలో అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం.


నమ్మ చెన్నై పాయింట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని