logo

బహిరంగ ప్రాంతాల్లో ‘మాస్కు’ తప్పనిసరి

ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెన్నై కార్పొరేషన్‌ ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమవుతుందని, నగరంలో రోజువారీ కేసులు వెయ్యి దాటుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు....

Updated : 05 Jul 2022 06:36 IST

చెన్నై కార్పొరేషన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెన్నై కార్పొరేషన్‌ ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమవుతుందని, నగరంలో రోజువారీ కేసులు వెయ్యి దాటుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా వాణిజ్య ప్రాంగణాలలో అధికంగా గుమిగూడే చోట ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. వాణిజ్య ప్రాంగణాలు, థియేటర్లు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, వినియోగదారులు మాస్కులు పెట్టుకోవడాన్ని ఆయా సంస్థలే నిర్ధారించాలని తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలకు ప్రజలు సహకారం అందించాలని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని