రొమ్ముక్యాన్సర్‌కు మందు

రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో సర్జరీ, రేడియో, కీమోథెరపీ ప్రధానం. కానీ మందులతోనే నయమైతే? భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సందీప్‌ మిశ్రా ఇలాంటి వినూత్న మందులనే

Published : 12 Jul 2022 01:08 IST

రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో సర్జరీ, రేడియో, కీమోథెరపీ ప్రధానం. కానీ మందులతోనే నయమైతే? భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సందీప్‌ మిశ్రా ఇలాంటి వినూత్న మందులనే (డీజెడ్‌నెపా, ఎంఎల్‌ఎన్‌4924) ఆవిష్కరించారు. ఇవి కణితిని అణచిపెట్టే జన్యువును లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. మూడో దశ క్యాన్సర్‌నూ నయం చేయగలవని భావిస్తున్నారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితం కనిపించటంతో వీటిని మనుషులపై ప్రయోగించటానికి ఇటీవలే అనుమతి లభించింది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే రెండు, మూడేళ్లలో ఈ మందులు మార్కెట్లోకి రాగలవని ఆశిస్తున్నారు. ఇవి తక్కువ ధరలోనే అందుబాటులో ఉండే అవకాశముంది. మాలిక్యులర్‌ ఆంకాలజీ రంగంలో మిశ్రా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ సంవత్సరం బీజే కెనెడీ డిస్టింగ్విష్డ్‌ రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కూడా లభించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని