కాలేయం జాగ్రత్త!
ఎల్లుండి ప్రపంచ హెపటైటిస్ దినం
కాలేయానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్‌లు. వీటిల్లో ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. హెపటైటిస్ ఎ, ఇ ఇన్‌ఫెక్షన్లు చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి. మామూలు కామెర్లు వీటితో వచ్చేవే. కానీ బి, సి వైరస్‌లు ప్రమాదకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండగా.. 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే- హెపటైటిస్ బారినపడ్డవారిలో నూటికి 70 మందికి ఆ విషయమే తెలియకపోవటం. జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయట పడటం. ఈ నేపథ్యంలో హెపటైటిస్‌పై అవగాహన కలిగుండటం మంచిది.
హెపటైటిస్ ఎ
దీని బారినపడ్డవారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం.. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబెట్టొచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, సురక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్ ఎ ఇన్‌ఫెక్షన్ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ.
హెపైటిస్ బి
దీని బారినపడ్డవారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపించొచ్చు. అక్యూట్ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోనే 99.5% మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య తగ్గుతుంది. దాదాపు 90% మందిలో వైరస్ కూడా దానంతటదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల (క్రానిక్) సమస్యగా మారొచ్చు. ఇన్‌ఫెక్షన్ ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్ హెపటైటిస్ బిగా భావిస్తారు. వైరస్ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదముంది.
హెపటైటిస్ సి
తొలిదశలో అంతగా లక్షణాలేవీ ఉండవు. హెపటైటిస్ బిలో మాదిరిగానే ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం వంటివి ఉండొచ్చు. ఇది చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టి పడటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తటానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా. హెపటైటిస్ సితో హెపటైటిస్ బి కూడా ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి. దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టయితే కాలేయ పనితీరు, వైరస్ ఉపరకాలను తెలిపే పరీక్షలు అవసరమవుతాయి. వైరస్ ఉపరకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
హెపైటిస్ డి
ఇది హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలావరకు ఈ రెండు ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. చాలామంది దీన్నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి మాదిరిగానే ఇన్‌ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు, ఒకరు వాడిని సూదులను మరొకరకు వాడటం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది.
హెపటైటిస్ ఇ
ఈ ఇన్‌ఫెక్షన్ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్ వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతి వంటివి కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, దురద, దద్దు, కీళ్ల నొప్పులూ తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చ బడుతుంటాయి. మలం తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్ ఇ ఇన్‌ఫెక్షన్ చాలావరకు 2-6 వారాల్లో అదే తగ్గిపోతుంది. అరుదుగా తీవ్రం కావొచ్చు.
నివారణ ముఖ్యం
* కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉంటే హెపటైటిస్ ఎ, ఇ సోకకుండా చూసుకోవచ్చు.
* హెపటైటిస్ బి గలవారి రక్తం, శారీరక స్రావాల ద్వారా వైరస్ సోకుతుంది. కాబట్టి అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్లు, టూత్‌బ్రష్షుల వంటివి వాడుకోకూడదు. హెపటైటిస్ బికి టీకా అందుబాటులో ఉంది. దీని నివారణకు ఇదే అత్యుత్తమ మార్గం.
* హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్తమార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల బ్లేడ్లు, బ్రష్షుల వటివి వాడుకోవద్దు. పచ్చబొట్లు పొడిచేందుకు, చెవులు, శరీర భాగాలు కుట్టేందుకు ఉపయోగించే సూదులు, పరికరాలు ఒకరికి వాడినవి మరొకరికి వాడకూడదు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై.. కేంద్రం క్లారిటీ..!
-
Movies News
Thank You: నాగ చైతన్య ‘థ్యాంక్యూ’.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
-
Politics News
Bihar: భాజపాతో నీతీశ్ బ్రేకప్ వార్తలు: బిహార్‌లో నేతలు బిజీబిజీ..!
-
Movies News
Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
-
World News
Rishi Sunak: రిషి సునాక్ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు
-
Movies News
Bigg Boss Telugu 6: ‘బిగ్‌బాస్’ మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే