అరికాలు నొప్పా?

కొందరికి ఉదయం పూట పాదాన్ని నేల మీద మోపగానే విపరీతమైన నొప్పి పుడుతుంటుంది. దీనికి ప్రధాన కారణం పాదం అడుగున వేళ్లు, మడమ ఎముకతో కలిసి ఉండే దృఢమైన కణజాలం వాయటం. దీన్నే ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ అంటారు. దీనికి

Published : 02 Aug 2022 01:06 IST

కొందరికి ఉదయం పూట పాదాన్ని నేల మీద మోపగానే విపరీతమైన నొప్పి పుడుతుంటుంది. దీనికి ప్రధాన కారణం పాదం అడుగున వేళ్లు, మడమ ఎముకతో కలిసి ఉండే దృఢమైన కణజాలం వాయటం. దీన్నే ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ అంటారు. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. వయసు, కొన్నిరకాల వ్యాయామాలు, పాదం అడుగు భాగం సమతలంగా ఉండటం లేదా పాదం మధ్యలో ఒంపు మరీ ఎత్తుగా ఉండటం వంటివి దోహదం చేస్తుంటాయి. గర్భధారణ సమయంలో బరువు పెరగటం, సరైన షూ వేసుకోకపోవటం వల్ల మగవారికన్నా మహిళలకు దీని ముప్పు మరింత ఎక్కువ. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ను నివారించుకోవచ్చు.
* బరువు అదుపులో ఉంటే పాదం మీద తక్కువ భారం పడుతుంది. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి.
* పాదాల మధ్య ఒంపునకు మంచి దన్ను కల్పించే, మెత్తటి షూ, చెప్పులు ధరించాలి.
* పరుగెత్తటం, నడవటం వంటి వ్యాయామాలు చేసేవారు ముందుగా పాదాలను కాస్త సాగదీసే సన్నద్ధ వ్యాయామాలు చేయాలి. వీలైతే పాదం మీద ఎక్కువ భారం పడకుండా చూసే ఈత, సైకిల్‌ తొక్కటం వంటివి ఎంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని