మద్యంతో జింక్‌ లోపం

జింక్‌ మనకు తక్కువ మొత్తంలోనే అవసరం. దీని లోపం అరుదనే చెప్పుకోవచ్చు. పేగుల్లో పూత, దీర్ఘకాలంగా విరేచనాలు, కాలేయం లేదా కిడ్నీ జబ్బులు, జీర్ణకోశ శస్త్రచికిత్స వంటివి జింక్‌ లోపానికి కారణం కావొచ్చు

Published : 16 Aug 2022 01:19 IST

జింక్‌ మనకు తక్కువ మొత్తంలోనే అవసరం. దీని లోపం అరుదనే చెప్పుకోవచ్చు. పేగుల్లో పూత, దీర్ఘకాలంగా విరేచనాలు, కాలేయం లేదా కిడ్నీ జబ్బులు, జీర్ణకోశ శస్త్రచికిత్స వంటివి జింక్‌ లోపానికి కారణం కావొచ్చు. మద్యం తాగేవారికి దీని ముప్పు ఎక్కువ. ఎందుకంటే అతిగా మద్యం తాగేవారు సరైన ఆహారం తినరు. మద్యం మూత్రం ద్వారా జింక్‌ ఎక్కువగా పోయేలా చేస్తుంది కూడా. జింక్‌ లోపం లక్షణాలు అస్పష్టంగా ఉంటాయి. రుచి, వాసన తగ్గటం, ఆకలి మందగించటం, కుంగుబాటు, తరచూ ఇన్‌ఫెక్షన్లు రావటం, పుండ్లు త్వరగా మానకపోవటం, విరేచనాలు, జుట్టు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాల జింక్‌ లోపంతో చర్మంలోనూ మార్పులు రావొచ్చు. దీన్ని ఎండుగజ్జిగానూ పొరపడుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని