కిడ్నీ రాళ్లపై చిన్న చూపొద్దు!

చిన్న కిడ్నీరాళ్లు పెద్దగా ఇబ్బంది కలిగించవు. కిడ్నీ రాళ్లను తొలగించేటప్పుడు శస్త్రచికిత్స నిపుణులు వీటిని అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఐదేళ్లలో రాళ్లు తిరిగి ఏర్పడే అవకాశం ఎక్కువవుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది.

Updated : 16 Aug 2022 06:46 IST

చిన్న కిడ్నీరాళ్లు పెద్దగా ఇబ్బంది కలిగించవు. కిడ్నీ రాళ్లను తొలగించేటప్పుడు శస్త్రచికిత్స నిపుణులు వీటిని అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఐదేళ్లలో రాళ్లు తిరిగి ఏర్పడే అవకాశం ఎక్కువవుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది. సాధారణంగా శస్త్రచికిత్స చేసేటప్పుడు 6 మి.మీ. కన్నా చిన్న రాళ్లను ముట్టుకోరు. వీటిని నిశితంగా గమనిస్తుంటారు. ఎందుకంటే మూత్రమార్గంలోకి వస్తే ఇవి తేలికగా బయటకు వచ్చేస్తాయి. వీటికి చికిత్స చేయటంపై డాక్టర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. రాళ్లు పెద్దగా లేకపోతే అంతగా పట్టించుకోరు. అయితే ఇలాంటి రాళ్లనూ తొలగిస్తే తిరిగే ఏర్పడే అవకాశం 82 శాతం వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల పెద్ద రాళ్లతో పాటు చిన్న, ఇబ్బందులు కలిగించని కిడ్నీ రాళ్లను కూడా తొలగించటమే మేలని సూచిస్తున్నారు. ఇందుకు కాస్త ఎక్కువ సమయం పట్టినా, ఖర్చు ఎక్కువ అయినా మళ్లీ రాళ్లు ఏర్పడినప్పుడు చేసే చికిత్సతో పోలిస్తే తక్కువేనని గుర్తుచేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని