నెమ్మదిగా లేవాలి

కొందరు మంచం మీది నుంచి గబాలున లేస్తుంటారు. ఇది మంచిది కాదు. పడుకొని లేచినప్పుడు గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్లకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో రక్తపోటు హఠాత్తుగా తగ్గుతుంది. తల తేలినట్టు, తూలినట్టు అనిపిస్తుంది. స్పృహ తప్పిపోవచ్చు కూడా. కాబట్టి నెమ్మదిగా లేవాలి. మంచం మీది నుంచి కాళ్లు

Published : 20 Sep 2022 00:28 IST

కొందరు మంచం మీది నుంచి గబాలున లేస్తుంటారు. ఇది మంచిది కాదు. పడుకొని లేచినప్పుడు గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్లకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో రక్తపోటు హఠాత్తుగా తగ్గుతుంది. తల తేలినట్టు, తూలినట్టు అనిపిస్తుంది. స్పృహ తప్పిపోవచ్చు కూడా. కాబట్టి నెమ్మదిగా లేవాలి. మంచం మీది నుంచి కాళ్లు కింద పెట్టి కాసేపు అలాగే కూర్చోవాలి. దీంతో శరీరం కుదురుకుంటుంది. ఆ తర్వాత లేచి, నిల్చోవాలి. ఇంతకుముందు తల తేలినట్టు అనిపించినవారికిది మరింత ముఖ్యం. ఇలాంటి చిన్న జాగ్రత్తతో కింద పడకుండా కాపాడుకోవచ్చు. దెబ్బలు తగలకుండా చూసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని