3 నిమిషాల్లోనే పార్కిన్సన్స్‌ పరీక్ష!

చేతులు, తల వణకటం.. ఉన్నట్టుండి కంపించటం, కదలికలు నెమ్మదించటం, నడక మారిపోవటం. పార్కిన్సన్స్‌ జబ్బు ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంటుంది. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. ప్రస్తుతానికి దీన్ని నిర్ధరించే పరీక్ష కూడా లేదు. లక్షణాల ఆధారంగానే జబ్బును గుర్తిస్తున్నారు.

Updated : 14 Oct 2022 10:30 IST

చేతులు, తల వణకటం.. ఉన్నట్టుండి కంపించటం, కదలికలు నెమ్మదించటం, నడక మారిపోవటం. పార్కిన్సన్స్‌ జబ్బు ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంటుంది. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. ప్రస్తుతానికి దీన్ని నిర్ధరించే పరీక్ష కూడా లేదు. లక్షణాల ఆధారంగానే జబ్బును గుర్తిస్తున్నారు. తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వినూత్న పరీక్ష కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీంతో మూడంటే మూడు నిమిషాల్లోనే పార్కిన్సన్స్‌ జబ్బును గుర్తించటానికి వీలుండటం విశేషం. ఇది చర్మం నుంచి ఉత్పత్తయ్యే నూనె(సీబమ్‌)లోని రసాయనాల మిశ్రమంలో మార్పులను విశ్లేషించటం ద్వారా సమస్యను గుర్తిస్తుంది. పార్కిన్సన్స్‌ నిర్ధరణ, జబ్బు నియంత్రణ విషయంలో ఈ పరీక్ష గణనీయమైన మార్పులను తీసుకొస్తుందని పరిశోధకుల్లో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌కు చెందిన మాంటీ సిల్వర్‌డేల్‌ పేర్కొంటున్నారు. చర్మానికి కోత పెట్టాల్సిన అవసరం లేకపోవటం, చాలా త్వరగా ఫలితాన్ని తెలుపుతుండటమే దీనికి కారణం. కొత్త పరీక్షను పెద్ద ఎత్తున తయారుచేయటానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ప్రయోగశాల వెలుపల వాడుకోవటానికి వీలుగా దీన్ని మరింత మెరుగు పరచాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే పార్కిన్సన్స్‌ జబ్బుతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని