Published : 01 Nov 2022 00:10 IST

అధిక రక్తపోటుతో మతిమరుపు ముప్పు!

వృద్ధాప్యంలో మతిమరుపు బారినపడొద్దని అనుకుంటున్నారా? అయితే రక్తపోటు అదుపులో ఉండేలా చూసుకోండి. అధిక రక్తపోటు గలవారు దీన్ని నియంత్రణలో ఉంచుకుంటే డిమెన్షియా ముప్పు తగ్గుతున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. డిమెన్షియాకు సమర్థ చికిత్సలు అందుబాటులో లేని నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. డిమెన్షియా బాధితుల చికిత్సకూ ఖర్చూ ఎక్కువవుతోంది. అందువల్ల దీన్ని కొంతమేరకు నివారించుకోగలిగినా పెద్ద ప్రభావమే చూపుతుంది. డిమెన్షియాను నివారించుకోవటానికి రక్తపోటును తగ్గించే మందులు ప్రస్తుతం మంచి పరిష్కార మార్గం కాగలవని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. అధిక రక్తపోటుతో రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడులో రక్తనాళాలు దెబ్బతింటే దీని పనితీరు మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు