పక్షవాతం ముప్పుపై అవగాహన తక్కువే!

పక్షవాతం చాపకింద నీది. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్ప కూల్చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలోనూ దీనిపై ఇప్పటికీ పెద్దగా అవగాహన ఉండటం లేదు

Published : 29 Nov 2022 00:42 IST

పక్షవాతం చాపకింద నీది. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్ప కూల్చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలోనూ దీనిపై ఇప్పటికీ పెద్దగా అవగాహన ఉండటం లేదు.రులా దాడి చేస్తుం మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం మూలంగా తలెత్తే పక్షవాతం బారినపడుతున్నవారిలో మూడింట రెండొంతుల మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటి ముప్పు కారకాల గురించి తెలియనే తెలియదని స్విట్జర్లాండ్‌ అధ్యయనంలో బయట పడటమే దీనికి నిదర్శనం. పక్షవాతం బారినపడ్డ వారి ఆరోగ్య వివరాలు పరిశీలించగా.. వీరిలో అప్పటికే 61% మందికి రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు.. 23% మందికి రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. మరో 10% మందికి గుండె వేగంగా కొట్టుకోవటం, సుమారు 5% మందికి మధుమేహం ఉన్నట్టూ బయటపడింది. ఇలాంటి సమస్యలను వీరిలో అంతకుముందెన్నడూ గుర్తించకపోవటం గమనార్హం. పక్షవాత నివారణంలో అధిక రక్తపోటుతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను పరీక్షించి, అవసరమైతే చికిత్స చేయటం చాలా ముఖ్యమనే విషయాన్ని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతు న్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని