హెచ్ఐవీకి టీకా!
హెచ్ఐవీని నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ నియంత్రణలో ఉంచే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీనికి టీకాను తయారుచేయటానికి చాలాకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ సఫలం కాలేదు. ఈ టీకాలేవీ బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను పుట్టించలేకపోయాయి. ఒకరకంగా వీటిని సూపర్ యాంటీబాడీలని అనుకోవచ్చు. మనుషుల్లో ఇలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను పుట్టించే టీకాలను రూపొందిస్తే ఎంతగానో ఉపయోగపడతాయి. టీకాల తయారీ కష్టమైన హెచ్ఐవీ వంటి వైరస్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. ఈ దిశగానే స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ముందడుగు వేశారు. వినూత్న జెర్మ్లైన్ టార్గెటింగ్ పరిజ్ఞానంతో సరికొత్త టీకాను రూపొందించారు. ఒంట్లో అరుదైన రకం కణాన్ని సృష్టించం దీని ఉద్దేశం. కొత్త పరిజ్ఞానం సాయంతో ముందుగా నిర్ణయించిన ప్రత్యేక జన్యు స్వభావంతో కూడిన యాంటీబాడీలను పుట్టించే టీకాల తయారీ సాధ్యమేనని గుర్తించారు. ఇది మనుషుల్లో 97% వరకు సమర్థంగా పనిచేస్తున్నట్టు తొలిదశ ప్రయోగ పరీక్షలో తేలటం విశేషం. మనుషుల్లో అవసరమైనట్టుగా యాంటీబాడీలను పుట్టించగల టీకాలను రూపొందించొచ్చని దీని ద్వారా రుజువైందని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన విలియం షీఫ్ చెబుతున్నారు. హెచ్ఐవీకే కాదు.. ఈ టీకా పరిజ్ఞానాన్ని ఫ్లూ, హెపటైటిస్ సి, కరోనావైరస్ల చికిత్సలకూ వాడుకోవచ్చని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు