మెదడుపై కాలేయ కొవ్వు భారం

మెదడు పనితీరు మారటానికి, కాలేయానికి కొవ్వు పట్టటానికి మధ్య సంబంధం ఉంటున్నట్టు రోజర్‌ విలియం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెపటాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated : 27 Dec 2022 05:01 IST

మెదడు పనితీరు మారటానికి, కాలేయానికి కొవ్వు పట్టటానికి మధ్య సంబంధం ఉంటున్నట్టు రోజర్‌ విలియం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెపటాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలేయంలో కొవ్వు మోతాదు పెరగటం వల్ల మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతోందని, మెదడు కణజాలంలో వాపు ప్రక్రియకు దారితీస్తోందని కనుగొన్నారు. ఇవి రెండూ తీవ్ర మెదడు సమస్యలకు కారణమయ్యేవే. అనారోగ్యకరమైన ఆహారం, ఊబకాయం మెదడుపై విపరీత ప్రభావం చూపుతాయని అధ్యయనాల్లో బయటపడింది. కాలేయ కొవ్వుతోనూ మెదడు క్షీణిస్తున్నట్టు తాజాగా బయటపడటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని