యాపిల్‌ జ్ఞాపకం!

మతిమరుపు తగ్గటానికి బాదం బాగా ఉపయోగపడుతుంది. ఐదారు బాదం గింజలను గంటసేపు నీటిలో నానబెట్టి, పొట్టుతీయాలి.

Published : 25 Apr 2023 00:24 IST

తిమరుపు తగ్గటానికి బాదం బాగా ఉపయోగపడుతుంది. ఐదారు బాదం గింజలను గంటసేపు నీటిలో నానబెట్టి, పొట్టుతీయాలి. వీటిని గంధం చెక్క సాయంతో బండ మీద రుద్ది ముద్ద చేసి మజ్జిగలో కలిపి తాగాలి. విడిగానైనా తీసుకోవచ్చు. అక్రోట్లు (వాల్‌నట్‌) కూడా మంచివే. వీటిని ఎండుద్రాక్ష లేదా అంజీరతో కలిపి తింటే ఇంకా ఎక్కువ గుణం కనిపిస్తుంది. జ్ఞాపకశక్తి పెరగటానికి యాపిల్‌ కూడా దోహదం చేస్తుంది. ఇందులో గ్లూటమిక్‌ ఆమ్లం సంశ్లేషణకు తోడ్పడే విటమిన్‌ బి1, ఫాస్ఫరస్‌, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలెన్నో ఉన్నాయి. ఈ ఆమ్లం నాడీ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. యాపిళ్లను తేనె లేదా పాలతో తీసుకుంటే చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇది నాడులను పునరుత్తేజితం చేసి, కొత్త శక్తిని ప్రసాదిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని