కొవిడ్ టీకా సామర్థ్యానికి ఊబకాయం దెబ్బ
రోగనిరోధక శక్తి క్షీణించిన వారు, వృద్ధుల వంటి కొందరిలో కొవిడ్ టీకాలతో అంత బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు కలగటం లేదు.
రోగనిరోధక శక్తి క్షీణించిన వారు, వృద్ధుల వంటి కొందరిలో కొవిడ్ టీకాలతో అంత బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు కలగటం లేదు. ఊబకాయులూ ఈ కోవలోనే వస్తున్నట్టు తాజాగా బయటపడింది. సార్స్-కొవీ-2 మీదుండే ముల్లు ప్రొటీన్‌ను గుర్తించటం ద్వారా కొవిడ్ టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు ఊబకాయుల్లో తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జి, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాల పరిశోధకులు టీకా సామర్థ్యంపై పరిశోధన చేపట్టారు. టీకా తీసుకున్న తర్వాత తీవ్ర కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన, మరణించిన వారి వివరాలను పరిశీలించారు. శరీర బరువు, ఎత్తు నిష్పత్తి (బీఎంఐ) మామూలుగా ఉన్నవారితో పోలిస్తే బాగా ఊబకాయం (బీఎంఐ 40కి పైగా) గలవారికి ఆసుపత్రిలో చేరే, మరణించే ముప్పు 76% ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. బరువు తక్కువగా గలవారితో పోలిస్తే బీఎంఐ 30-40 మధ్య ఉన్నవారికీ ముప్పు ఒకింత ఎక్కువగానే ఉంటోందని తేల్చారు. బూస్టర్ మోతాదు తీసుకున్న తర్వాత వీరిలో యాంటీబాడీల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ వైరస్‌ను నిర్మూలించే సామర్థ్యం తగ్గినట్టు బయటపడింది. అంటే ఊబకాయుల్లో కొవిడ్ టీకాలు నాసిరకం యాంటీ బాడీలను పుట్టిస్తున్నాయన్నమాట. మామూలు బరువు గలవారితో పోలిస్తే ఊబకాయుల్లో యాంటీబాడీలు వైరస్‌ను పట్టుకోకపోవటానికిది కారణం అవుతుండొచ్చని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్