సిట్రోనెల్లాతో దోమలు పరార్‌

దోమలు కుట్టకుండా చూసుకోవటానికి మస్కిటో కాయిల్స్‌ వెలిగించటం తెలిసిందే. అయితే రసాయనాలతో కూడిన వీటి నుంచి వెలువడే పొగ ఆస్థమా వంటి శ్వాసకోశ సమస్యలను ప్రేరేపితం చేయొచ్చు

Published : 30 May 2023 01:23 IST

దోమలు కుట్టకుండా చూసుకోవటానికి మస్కిటో కాయిల్స్‌ వెలిగించటం తెలిసిందే. అయితే రసాయనాలతో కూడిన వీటి నుంచి వెలువడే పొగ ఆస్థమా వంటి శ్వాసకోశ సమస్యలను ప్రేరేపితం చేయొచ్చు. కళ్లు మండటం, వాసన వేయటం వంటి ఇబ్బందులూ తలెత్తొచ్చు. ఇలాంటి సమయాల్లోనే దోమలను తరిమే సహజ పద్ధతులు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇందుకు సిట్రోనెల్లా నూనెలు, కొవ్వొత్తులు, స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లో పరిమళాన్ని వెదజల్లుతూనే దోమలను తరిమి కొడతాయి. సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెలాల్‌, జెరానియాల్‌ వంటి సహజ క్రిమి నిరోధకాలు ఉంటాయి. ఇవి కీటకాల వంటి వాటిని చంపవు గానీ వాటిని ఆకర్షించే వాసనలను మరుగునపడేలా చేస్తాయి. అంటే దోమల వంటివి మన శరీరం నుంచి వెలువడే వాసనలను గ్రహించలేవన్నమాట. దీంతో దోమల నుంచి విముక్తి కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని