ప్రసవానంతర కుంగుబాటుకు ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌

కొందరు మహిళల్లో గర్భం ధరించినప్పుడు, కాన్పు తర్వాత దిగులు, నిరాశ తలెత్తుంటాయి. దీన్నే ప్రసవానంతర కుంగుబాటు అంటారు. ఇది తల్లి, బిడ్డ.. ఇద్దరికీ చేటే. మున్ముందు తీవ్ర అనర్థాలకూ దారితీయొచ్చు.

Published : 18 Jun 2024 00:05 IST

కొందరు మహిళల్లో గర్భం ధరించినప్పుడు, కాన్పు తర్వాత దిగులు, నిరాశ తలెత్తుంటాయి. దీన్నే ప్రసవానంతర కుంగుబాటు అంటారు. ఇది తల్లి, బిడ్డ.. ఇద్దరికీ చేటే. మున్ముందు తీవ్ర అనర్థాలకూ దారితీయొచ్చు. అందుకే నిపుణులు దీన్ని తగ్గించటానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. గర్భం ధరించినప్పుడు కుంగుబాటు గలవారికి కాన్పు అనంతరం తక్కువ మోతాదులో ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ఇటీవల బయటపడింది. కుంగుబాటులో వాడే కెటమైన్‌ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. అయితే ఇది ప్రసవానంతర కుంగుబాటుకు పనిచేస్తుందో లేదో ఇప్పటివరకూ తెలియదు. దీన్ని గుర్తించటానికే కొందరు బాలింతలకు తక్కువ మోతాదులో ఒక్కసారే ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చి పరిశీలించారు. ఇది సుమారు 75% వరకూ కుంగుబాటు లక్షణాలు పొడసూపకుండా కాపాడుతున్నట్టు తేలింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు