సోయా విరుగుడు

ముట్లుడిగిన (మెనోపాజ్‌) దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టటం, యోని పొడబారటం వంటివి చాలా ఇబ్బంది పెడుతుంటాయి....

Published : 19 Jul 2016 02:23 IST

మెనోపాజ్‌
సోయా విరుగుడు

ముట్లుడిగిన (మెనోపాజ్‌) దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టటం, యోని పొడబారటం వంటివి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు తగ్గటానికి సోయాబీన్స్‌ వంటి వాటిల్లోని వృక్ష రసాయనాలు కూడా బాగా ఉపయోగపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మెనోపాజ్‌ లక్షణాలు తగ్గటానికి డాక్టర్లు హార్మోన్‌ భర్తీ చికిత్స సిఫారసు చేస్తుంటారు. అయితే దీంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉండటం వల్ల చాలామంది స్త్రీలు ప్రత్యామ్నాయ చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెనోపాజ్‌ లక్షణాలపై వృక్ష రసాయనాలు చూపే ప్రభావాలను పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు. సోయాబీన్స్‌ వంటి వాటిల్లో కనబడే ఫైటోఈస్ట్రోజెన్స్‌.. వేడి ఆవిర్లను, యోని పొడిబారటాన్ని తగ్గిస్తున్నట్టు తేలింది. దేవదారు బెరడు సారంలోని పైక్నోజెనాల్‌ వంటి ఇతరత్రా రసాయనాలు సైతం ఇలాంటి ప్రభావాన్నే చూపిస్తుండటం గమనార్హం. ఇవి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మాదిరిగానే ఉండటం మూలంగా మెనోపాజ్‌ లక్షణాలు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని