వెంట్రుకలకు కాలుష్య కాటు!

వాయు కాలుష్యం వెంట్రుకలనూ దెబ్బతీస్తుంది. గాలిలోని కాలుష్య కారకాలు జుట్టుకు, మాడుకు అంటుకుపోయి దురద, చిరాకు కలగజేస్తాయి. ఇవి తేమను లాగేసుకొని జుట్టు పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు కళ తప్పుతుంది. వెంట్రుకలు పెళుసుబారి తేలికగా విరిగిపోతాయి.

Published : 27 Mar 2018 01:29 IST

వెంట్రుకలకు కాలుష్య కాటు!

వాయు కాలుష్యం వెంట్రుకలనూ దెబ్బతీస్తుంది. గాలిలోని కాలుష్య కారకాలు జుట్టుకు, మాడుకు అంటుకుపోయి దురద, చిరాకు కలగజేస్తాయి. ఇవి తేమను లాగేసుకొని జుట్టు పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు కళ తప్పుతుంది. వెంట్రుకలు పెళుసుబారి తేలికగా విరిగిపోతాయి. రోజులో ఎక్కువసేపు బయట తిరిగేవారికి ఈ ముప్పు మరీ ఎక్కువ. అయితే కొన్ని జాగ్రత్తలతో ఈ కాలుష్యం ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
* బయటకు వెళ్లేముందు తలకు టోపీ ధరించటం లేదా రుమాలు చుట్టుకోవటం మంచిది.
* తడికి దుమ్ము ధూళి అంటుకుపోతాయి. కాబట్టి తడి జట్టుతో రోడ్డు మీదికి వెళ్లకూడదు.
* జుట్టును గాలికి వదిలేయకుండా వీలైనంత వరకు తలకు దగ్గరగా ముడివేసుకోవాలి. అలాగని రబ్బరుబ్యాండ్ల వంటి వాటితో మరీ గట్టిగా బిగించకూడదు.
* వారానికి ఒకసారి షాంపూతో తలస్నానం చేశాక జట్టుకు ఆవిరి పడితే మాడు మీది సూక్ష్మ రంధ్రాలు తెరచుకొని వాటిల్లో చిక్కుకున్న కాలుష్య కారకాలు తేలికగా బయటకు వచ్చేస్తాయి.
* తేనె, పెరుగు, స్ట్రాబెర్రీ, వెనిగర్‌ కలిపి ఇంట్లో చేసుకునే మాస్క్‌ వెంట్రుకలకు రాసుకొని, అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవటం మంచిది.
* చేపలు, గింజపప్పులు, పెరుగు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవటం ద్వారా వెంట్రుకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
* కొబ్బరినూనెలోని లారిక్‌ యాసిడ్‌ వెంట్రుకలోని కెరటిన్‌ దెబ్బతినకుండా చూస్తుంది. ఇది వెంట్రుకల మధ్యలోని ఖాళీల్లో నిండి దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు, రసాయనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని