పడకుండా చూసుకోండి

వృద్ధుల్లో ఎముక క్షీణత ఎక్కువ. పైగా వీరికి తూలి కింద పడిపోయే ముప్పూ ఎక్కువే. దీంతో ఎముకలు, తుంటి విరిగి ఎంతోమంది మంచాన పడిపోతుంటారు. నిజానికి బయటకు వెళ్లినపుడే కాదు,

Published : 16 Aug 2016 01:27 IST

పడకుండా చూసుకోండి

వృద్ధుల్లో ఎముక క్షీణత ఎక్కువ. పైగా వీరికి తూలి కింద పడిపోయే ముప్పూ ఎక్కువే. దీంతో ఎముకలు, తుంటి విరిగి ఎంతోమంది మంచాన పడిపోతుంటారు. నిజానికి బయటకు వెళ్లినపుడే కాదు, ఇంట్లోనూ పడిపోయే అవకాశముంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

* అన్ని గదుల్లోనూ.. ముఖ్యంగా నేల మీద వస్తువులు చిందర వందరగా పడేయకుండా, పాదాలకు తగలకుండా చూసుకోవాలి. నేల నున్నగా ఉండాలి. కానీ జారిపోయేలా ఉండకూడదు. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లేప్పుడు నేల ఎగుడు దిగుడుగా ఉంటే చూసి నడవాలి. గడపల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

* విద్యుత్తు పరికరాల తీగలు, టెలిఫోన్‌ తీగలు దారికి అడ్డంగా లేకుండా చూసుకోవాలి.

* ఇంట్లోనూ కాలికి దన్నుగా నిలిచే షూ ధరించాలి. మడమలు మరీ ఎత్తుగా ఉండకూడదు. పాదాలకు కేవలం సాక్స్‌ వేసుకొని నడవొద్దు.

* ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు నిచ్చే లైట్లు వాడాలి.

* తివాచీలను నేలకు పూర్తిగా అంటుకొని ఉండేలా చూసుకోవాలి. ఇవి జారినా, వీటి చివర్లు పైకి లేచినా తూలి పడే అవకాశముంది.

* మెట్లకు రెండు వైపులా పట్టుకోవటానికి వీలుగా చువ్వలుండాలి. అలాగే చీకట్లో మెట్లు స్పష్టంగా కనబడేలా లైట్లు వేయాలి.

* స్నానాలగదుల్లోనూ పట్టుకొని లేవటానికి వీలుగా గోడలకు కొక్కేలు అమర్చుకోవాలి.

* బాత్రూమ్‌కు వెళ్లే దారిలో రాత్రిపూట తప్పనిసరిగా లైటు వేసి ఉంచాలి.

* పడుకునేప్పుడు మంచం పక్కన టార్చిలైటు పెట్టుకోవాలి. అందులో బ్యాటరీలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని