మెదడుకు ధ్యానం బీమా
వయసు మీద పడుతున్నకొద్దీ మన మెదడులోని అనుసంధాన కణజాలం క్షీణిస్తుంటుంది. దీంతో మెదడు సైజు కూడా తగ్గుతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను, పనుల నిర్వహణ వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతమాత్రాన మరీ బెంగ పడాల్సిన పనేమీ లేదని...
మెదడుకు ధ్యానం బీమా
వయసు మీద పడుతున్నకొద్దీ మన మెదడులోని అనుసంధాన కణజాలం క్షీణిస్తుంటుంది. దీంతో మెదడు సైజు కూడా తగ్గుతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను, పనుల నిర్వహణ వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతమాత్రాన మరీ బెంగ పడాల్సిన పనేమీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ) అధ్యయనం భరోసా ఇస్తోంది. ముందు నుంచే ధ్యానం చేయటం ద్వారా మేధో క్షీణతను తగ్గించుకునే అవకాశం లేకపోలేదని చెబుతోంది. దీర్ఘకాలంగా ధ్యానం చేసేవారి మెదడు మరింత చురుకుగా ఉంటుండటమే దీనికి నిదర్శనం. సాధారణంగా వయసుతో పాటు క్షీణిస్తూ వచ్చే మెదడు కణజాలం వీరిలో అంతగా తగ్గకపోవటం గమనార్హం. వీరి శారీరక వయసు కన్నా మెదడు వయసు తక్కువగా కనబడుతోంది. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తులను తీసుకుంటే- ధ్యానం చేయనివారితో పోలిస్తే ధ్యానం చేసేవారి మెదడు వయసు సుమారు ఏడేళ్లు తక్కువగా ఉంటోంది. అంటే శారీరక వయసు 50 ఏళ్లు అయినా మెదడు వయసు మాత్రం 43 ఏళ్లే అన్నమాట. అంతేకాదు.. 50 ఏళ్ల తర్వాత కూడా ఏటా మెదడు వయసు శరీర వయసు కన్నా ఒకటిన్నర నెలలు తక్కువగానే కనబడుతోంది. ఇంతకీ దీనికి కారణమేంటి? ఒకటి- ధ్యానం చేసేటప్పుడు కుదిరే ఏకాగ్రత మూలంగా నాడీ నిర్మాణాలు వృద్ధి చెందటం, నాడీకణాల మధ్య అనుసంధానాల సామర్థ్యం మెరుగుపడటం. రెండోది- దీర్ఘకాల ఒత్తిడి దుష్ప్రభావాల నుంచి మెదడును, నాడీవ్యవస్థను ధ్యానం కాపాడుతుండటం. మెదడుపై ఒత్తిడి ప్రభావం తగ్గితే వాపు ప్రక్రియ ప్రతిస్పందన కూడా తగ్గుముఖం పడుతుంది. క్రోమోజోముల వయసును నిర్ధరించే వాటి టెలోమేర్స్ (తోకల్లాంటివి) పొడవు తగ్గటమూ నెమ్మదిస్తుంది. ఇవన్నీ మెదడుకు త్వరగా ‘వృద్ధాప్యం’ ముంచుకు రాకుండా కాపాడుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!