వృద్ధులకు తై చీ అండ!

వృద్ధులు తరచుగా శరీరం మీద నియంత్రణ కోల్పోతుంటారు. దీంతో కింద పడిపోతుంటారు. ఎముకలు, తుంటి విరిగిపోయి మంచాన పడుతుంటారు. అందువల్ల శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాలు చేయటం ఎంతో మంచిది. ఈ విషయంలో చైనా యుద్ధకళ ....

Published : 21 Nov 2017 01:53 IST

వృద్ధులకు తై చీ అండ!

వృద్ధులు తరచుగా శరీరం మీద నియంత్రణ కోల్పోతుంటారు. దీంతో కింద పడిపోతుంటారు. ఎముకలు, తుంటి విరిగిపోయి మంచాన పడుతుంటారు. అందువల్ల శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాలు చేయటం ఎంతో మంచిది. ఈ విషయంలో చైనా యుద్ధకళ పద్ధతి తై చీ బాగా మేలు చేయగలదని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తై చీ పద్ధతిలో శరీర బరువును నెమ్మదిగా ఒక కాలి మీది నుంచి మరో కాలి మీద పడేలా లయబద్ధంగా కదులుతూ ఉంటారు. ఇది శరీర నియంత్రణకు తోడ్పడుతుందని, ఫలితంగా కింద పడిపోయే ముప్పు తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు ఏడాది పాటు తై చీ సాధన చేస్తే కింద పడిపోయే ముప్పు 43% మేరకు తగ్గగా.. ఇంకాస్త ఎక్కువకాలం సాధన చేస్తే మరో 13% ముప్పూ తగ్గుతుండటం గమనార్హం. ఒకవేళ కింద పడినా కూడా అంతగా గాయాలు కాకపోవటం విశేషం. అయితే నిపుణుల ద్వారానే తై చీ పద్ధతిని నేర్చుకొని సాధన చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు