బ్యాక్టీరియా ‘ఆయుష్షు’!

మన ఆరోగ్యం విషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను జీర్ణం చేయటం దగ్గర్నుంచి రోగనిరోధకవ్యవస్థకు తర్ఫీదు ఇవ్వటం వరకూ ఎన్నెన్నో పనులు నిర్వర్తిస్తుంది. అంతేనా? ఇది ఆయుష్షు పెరగటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది....

Published : 28 Nov 2017 02:12 IST

బ్యాక్టీరియా ‘ఆయుష్షు’!

న ఆరోగ్యం విషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను జీర్ణం చేయటం దగ్గర్నుంచి రోగనిరోధకవ్యవస్థకు తర్ఫీదు ఇవ్వటం వరకూ ఎన్నెన్నో పనులు నిర్వర్తిస్తుంది. అంతేనా? ఇది ఆయుష్షు పెరగటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. వృద్ధుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికీ పేగుల్లోని బ్యాక్టీరియాకూ గణనీయమైన సంబంధం కనబడుతుండటమే దీనికి నిదర్శనం. మంచి ఆరోగ్యంగా ఉన్న 90 ఏళ్ల వృద్ధుల్లో కూడా యువ ఆరోగ్యవంతుల పేగుల్లో మాదిరిగానే బ్యాక్టీరియా రకాలు కనబడుతున్నట్టు తేలింది మరి. వృద్ధుల ఆరోగ్యానికి బ్యాక్టీరియా దోహదం చేస్తోందా? ఆరోగ్యవంతుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటోందా? అనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ రెండింటికీ లంకె ఉండటం మాత్రం నిజమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంటే రక్తనాళాల ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ మాదిరిగానే వృద్ధుల ఆరోగ్యానికీ పేగుల బ్యాక్టీరియాను జీవసూచికగా భావించవచ్చన్నమాట. అందువల్ల పెరుగు, పులియబెట్టిన పదార్థాల వంటి ప్రొబయోటిక్స్‌ తీసుకోవటం మంచిది. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. ప్రొబయోటిక్స్‌ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి, కొన్నిరకాల క్యాన్సర్ల బారినపడకుండా చూస్తాయి. అందువల్ల ఇవి ఆరోగ్యంగా ఉండటానికి, ఆయుష్షు పెరగటానికి దోహదం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని