ఆందోళనకు ఆహార కళ్లెం!

ఆందోళన మానసికంగా దెబ్బతీయటమే కాదు. రకరకాల జబ్బులనూ మోసుకొస్తుంది. కాబట్టి దీని లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవటం...

Published : 17 May 2016 02:06 IST

ఆందోళనకు ఆహార కళ్లెం!

ఆందోళన మానసికంగా దెబ్బతీయటమే కాదు. రకరకాల జబ్బులనూ మోసుకొస్తుంది. కాబట్టి దీని లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవటం మంచిది. ఆహారంతోనూ దీనికి కళ్లెం వేయొచ్చు.

* మెగ్నీషియం తక్కువగా గల ఆహారంతో ఆందోళన సంబంధ ప్రవర్తన పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, విత్తనాలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినాలి.

* జీడిపప్పు, కాలేయం, గుడ్డు పచ్చసొన వంటి వాటిల్లోని జింక్‌ కూడా ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది.

* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గల చేపలు సైతం ఆందోళన తగ్గిస్తాయి.

* పెరుగు వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలు నలుగురిలోకి వెళ్లినపుడు తలెత్తే ఆందోళన లక్షణాలను తగ్గిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చబఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్‌ వంటి వాటిల్లోని బి విటమిన్లు మానసికోల్లాసాన్ని కలిగించే సెరటోనిన్‌, డొపమైన్ల ఉత్పత్తిని పెంచుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని