ఉద్దీపన మెంతం

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు.

Published : 04 Apr 2017 01:22 IST

ఉద్దీపన మెంతం

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని