మనసుకు చక్కెర ‘దిగులు’

చక్కెర, తీపి పదార్థాలు అతిగా తింటే బరువు పెరుగుతుందని తెలుసు. దంతక్షయం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందని తెలుసు. కానీ వీటితో మానసిక సమస్యల ముప్పూ పొంచి ఉంటోందనే సంగతి తెలుసా?

Published : 01 Aug 2017 01:26 IST

మనసుకు చక్కెర ‘దిగులు’

క్కెర, తీపి పదార్థాలు అతిగా తింటే బరువు పెరుగుతుందని తెలుసు. దంతక్షయం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందని తెలుసు. కానీ వీటితో మానసిక సమస్యల ముప్పూ పొంచి ఉంటోందనే సంగతి తెలుసా? తీపి పదార్థాలు, తీపి పానీయాల ద్వారా రోజుకు 67 గ్రాముల కన్నా ఎక్కువ చక్కెరను తీసుకునే పురుషులకు దీర్ఘకాలంలో ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. నిజానికి తీపి పదార్థాలు తిన్నప్పుడు కొద్దిసేపటి వరకు హాయి భావన కలుగుతుంది. వీటి ప్రభావం తగ్గగానే తిరిగి మూడ్‌ మారిపోతుంటుంది. దీంతో మరింతగా తీపి పదార్థాలు తినటం మొదలెడుతుంటారని.. ఇది చివరికి మానసిక సమస్యలకూ దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు