కలుషితం కానివ్వొద్దు!

తినే ఆహారం కలుషితమైతే కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు...

Published : 19 Sep 2017 01:58 IST

కలుషితం కానివ్వొద్దు!

తినే ఆహారం కలుషితమైతే కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు.. కూరగాయలను పచ్చి మాంసం వంటి వాటితో కలవకుండా చూసుకోవాలి కూడా. లేకపోతే మాంసానికి అంటుకొని ఉండే బ్యాక్టీరియా వంటివి కూరగాయలకూ వ్యాపించే ప్రమాదముంది. ఇక వంటకాలను వేడివేడిగా తినటమే మంచిది. వండిన పదార్థాలను వేడి వాతావరణంలో గంట కన్నా ఎక్కువసేపు బయట ఉంచితే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో అది కలుషితమై రకరకాల అనర్థాలకు దారితీయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని