ఆహారంతోనూ ఒంటి కంపు

చెమట పట్టినపుడు శరీరం ఒకరకమైన వాసన వేయటం తెలిసిందే. దీనికి కారణం చర్మం మీదుండే బ్యాక్టీరియా చెమటలోని రసాయనాలను విడగొట్టటమే.

Published : 05 Jun 2018 01:28 IST

ఆహారంతోనూ ఒంటి కంపు

చెమట పట్టినపుడు శరీరం ఒకరకమైన వాసన వేయటం తెలిసిందే. దీనికి కారణం చర్మం మీదుండే బ్యాక్టీరియా చెమటలోని రసాయనాలను విడగొట్టటమే. యుక్తవయసుకు చేరుకునేటప్పుడు, మధుమేహం వంటి జబ్బులు గలవారిలోనూ శరీరం వాసన వేస్తుంటుంది. ఇందుకు కొన్ని పదార్థాలూ దోహదం చేస్తుంటాయి!

* మసాలాలు: లవంగాలు, ఇలాచీ, పసుపు, మెంతుల వంటి మసాలాలు నాలుకకు, దంతాలకు అతుక్కుపోయి ఒకరకమైన వాసన వచ్చేలా చేస్తాయి. మసాలాల అవశేషాలు మన శ్వాసలో, వెంట్రుకల్లో, చర్మం మీద గంటల కొద్దీ ఉండిపోతాయి!

*వెల్లుల్లి, ఉల్లి: ఇవి నాలుకకు, దవడలకు అతుక్కుపోవటం వల్ల నోటి నుంచి వాసన వెలువడుతుంటుంది. ఉల్లి, వెల్లుల్లి కొందరిలో జీవక్రియలు, శరీర ఉష్ణోగ్రత పెరిగేలా చేస్తాయి. చెమట కూడా ఎక్కువగా పడుతుంది. ఇది చర్మం మీద బ్యాక్టీరియాతో కలిసిపోయి ఒకరకమైన వాసన వస్తుంది.

* మాంసం: ఇది వాసనలేని ప్రోటీన్లను విడుదల చేస్తుంది. శ్వాస ద్వారా వెలుపలికి వచ్చే ఈ ప్రోటీన్లు చర్మం మీద బ్యాక్టీరియాతో కలగలసి వాసన మరింత ఎక్కువయ్యేలా చేస్తాయి.

* క్యాబేజీ, గోబీ: ఇవి సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇది చెమట, శ్వాస, గ్యాస్‌ ద్వారా బయటకు వచ్చేటప్పుడు దీని వాసన మరింత ఎక్కువవుతుంది..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని