పేగులపై ఉప్పు పిడుగు!

ఉప్పు ఉరిమి పేగుల మీద పడటమంటే ఇదే! వంటకాల రుచి పెంచే ఉప్పు మనకు మేలు చేసే పేగుల్లోని బ్యాక్టీరియాకు పిడుగుపాటుగా పరిణమిస్తోంది మరి. ఉప్పు అధికంగా తినటానికీ అధిక రక్తపోటుకూ సంబంధం ఉండటం తెలిసిందే....

Published : 12 Jun 2018 02:42 IST

పేగులపై ఉప్పు పిడుగు!

ప్పు ఉరిమి పేగుల మీద పడటమంటే ఇదే! వంటకాల రుచి పెంచే ఉప్పు  మనకు మేలు చేసే పేగుల్లోని బ్యాక్టీరియాకు పిడుగుపాటుగా పరిణమిస్తోంది మరి. ఉప్పు అధికంగా తినటానికీ అధిక రక్తపోటుకూ సంబంధం ఉండటం తెలిసిందే. అంతేకాదు, దీంతో మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి స్వీయ రోగనిరోధక సమస్యలూ త్వరగా ముదురుతుంటాయి. పేగుల్లో ల్యాక్టోబాసిలస్‌ అనే మంచి బ్యాక్టీరియాకు ఉప్పు ప్రమాదకరంగా పరిణమిస్తుండటమే దీనికి కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాల్లో ఉండే ల్యాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మందులను తట్టుకునే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవటంలోనూ, ల్యూపస్‌ బాధితుల్లో కిడ్నీలో వాపు తగ్గటంలోనూ పాలు పంచుకుంటుంది. అయితే ఉప్పు ఎక్కువగా తినటం మూలంగా పేగుల్లో ల్యాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా మరణిస్తున్నట్టు తాజాగా బయటపడటం గమనార్హం. కేవలం 2 వారాల్లోనే ఈ బ్యాక్టీరియా తుడిచిపెట్టుకుపోతుండటం విశేషం. అంతేనా? టిహెచ్‌17 అనే వాపు కారక రోగనిరోధక కణాల పనితీరునూ ఉప్పు ప్రేరేపితం చేస్తోంది. ఫలితంగా అధిక రక్తపోటు, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి సమస్యలకు ఊతమిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గించటంపై దృష్టి పెట్టటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని