పొటాషియం తగ్గితే..

ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించటం దగ్గర్నుంచి.. ఆహారం జీర్ణం కావటం...

Published : 28 Aug 2018 01:38 IST

పొటాషియం తగ్గితే..

నిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించటం దగ్గర్నుంచి.. ఆహారం జీర్ణం కావటం వరకూ ఎన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. అందుకే పొటాషియం లోపిస్తే కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారటం, మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. పొట్టుతీయని ధాన్యాలు, మాంసం, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో పొటాషియం దండిగా ఉంటుంది. ముఖ్యంగా అరటిపండు, చిలగడదుంపలతో పుష్కలంగా లభిస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు అంతగా తినకుండా చిప్స్‌ వంటి చిరుతిళ్లు ఎక్కువగా తినేవారిలో దీని లోపం ఎక్కువగా చూస్తుంటాం. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులతోనూ దీని మోతాదులు తగ్గిపోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని