జంట జీవితం హాయిగా

మూడుముళ్లు వేస్తే.. మలిసంధ్య జీవితం హాయిగా నడుస్తుందా? నడుస్తుందట! జీవితాంతం ఒంటరి పక్షుల్లా జీవించేవారితో పోలిస్తే... ఇలాంటి జంట పక్షుల జీవితం...

Published : 19 Dec 2017 02:17 IST

జంట జీవితం హాయిగా

మూడుముళ్లు వేస్తే.. మలిసంధ్య జీవితం హాయిగా నడుస్తుందా? నడుస్తుందట! జీవితాంతం ఒంటరి పక్షుల్లా జీవించేవారితో పోలిస్తే... ఇలాంటి జంట పక్షుల జీవితం వృద్ధాప్యంలో హాయిగా గడిచిపోతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మతిమరుపు, గుండెజబ్బులు రాకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాస్తవానికి వృద్ధాప్యంలో ఎదుర్కొనే మతిమరుపులాంటి సమస్యలకు ఇంతవరకూ ఏ మందూలేదు. దాని తీవ్రతని తగ్గించే ఏవో కొన్ని వ్యాయామాలు వంటివి తప్ప. కానీ అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాల్లోని సుమారు ఎనిమిది లక్షలమందిని వృద్ధాప్యంలో వచ్చే గుండెజబ్బులు, మతిమరుపు గురించి ఆరాతీశారు. వీరిలో కొందరు విడాకులు తీసుకున్న వారు అయితే కొందరు పూర్తిగా వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నవారు. మరికొందరు చిలకాగోరింకల్లా జీవితాన్ని గడుపుతున్నవారు. ఇందులో జంటగా కలిసిఉన్న వారితో పోలిస్తే... ఒంటరిగా ఉండే వారిలో 42 శాతం మతిమరుపు సమస్యలు ఎక్కువగా దాడిచేస్తున్నాయని తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని