బిడ్డకు పాలు..తల్లికి మేలు!
బిడ్డకు పాలు..తల్లికి మేలు!
తల్లిపాలు పట్టటం ఇటు పిల్లలకే కాదు, అటు తల్లులకూ ఎంతో మేలు చేస్తుంది. చనుబాలు పట్టటం మూలంగా- బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే కణాలు తల్లి నుంచి శిశువులకు అందుతాయి. దీంతో రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. ఫలితంగా ఆస్థమా, అలర్జీల వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లిపాలతో బుద్ధి కుశలత కూడా మెరుగవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక తల్లుల విషయానికి వస్తే- శిశువులకు పాలు పట్టటం వల్ల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యల ముప్పూ తగ్గుతుంది. అంతేకాదు.. పాలు పట్టే తల్లులకు గుండెపోటు, పక్షవాతం ముప్పు సైతం 9% వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. కాన్పయ్యాక పదేళ్ల తర్వాత కూడా ఈ ఫలితం కనబడుతుండటం గమనార్హం. పైగా ఇది పిల్లల సంఖ్య, పాలు పట్టే సమయంతోనూ ముడిపడి ఉంటోంది కూడా. ఒకరి కన్నా ఎక్కువమంది పిల్లలకు.. అలాగే ప్రతి బిడ్డకూ రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాలు పట్టినవారికి గుండెజబ్బు, పక్షవాతం ముప్పు 18% వరకూ తగ్గుతుండటం గమనార్హం. గుండెజబ్బు ముప్పు కారకాలైన కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటు, పొగ అలవాటు, వూబకాయం, శారీరకశ్రమ చేయకపోవటం వంటి అంశాలను పక్కనపెట్టి చూసినా ఈ ప్రభావం కనబడుతుండటం విశేషం. పాలు పట్టటం వల్ల కాన్పు తర్వాత మహిళల్లో జీవక్రియల్లో మార్పులు తలెత్తుతుండొచ్చని, ఇది గుండెజబ్బు ముప్పు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని పోషకాలు అందటానికి, కాన్పు అనంతరం శిశువుకు అవసరమైన పాలు పట్టటానికి వీలుగా తల్లి శరీరం ఆయా భాగాల్లో కొవ్వును నిల్వచేసుకుంటుంది. దీంతో గర్భిణులు బరువు పెరుగుతారు. అయితే శిశువుకు పాలు పట్టే సమయంలో జీవక్రియలు పుంజుకొని... కొవ్వు మరింత సమర్థంగా ఖర్చవుతుంది. దీంతో బరువు మాత్రమే కాదు.. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటమూ తగ్గుతుంది. ఇది గుండెజబ్బు, పక్షవాతం ముప్పులు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
-
India News
IAF: వాయుసేనకు భారీ నష్టం.. ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు
-
Politics News
Yuvagalam: వైకాపా చేసేది సామాజిక అన్యాయమే: లోకేశ్
-
Politics News
MNM: కాంగ్రెస్‌లో విలీనమా.. అదేం లేదు: వెబ్సైట్ హ్యాక్ అయిందన్న కమల్ పార్టీ
-
Movies News
Ayali Review: రివ్యూ: అయలీ.. దేవత దర్శనం ఆ అమ్మాయిలకేనా?
-
Sports News
IND vs NZ: అదే మా కొంప ముంచింది..: హార్దిక్ పాండ్య