పాపాయికి కథల తెలివి

‘అనగనగా ఒక రాజు. ఆయనకు ఏడుగురు కొడుకులు..’ ఇలా కథలు....

Published : 29 Aug 2017 01:49 IST

పాపాయికి కథల తెలివి

‘అనగనగా ఒక రాజు. ఆయనకు ఏడుగురు కొడుకులు..’ ఇలా కథలు చెబుతామంటే పిల్లలకు ఎగిరి గంతేస్తారు. వీటితో వినోదమే కాదు.. విజ్ఞానమూ లభిస్తుంది. కాస్త పెద్ద పిల్లలు మాత్రమే కాదు.. ఇంకా మాటలు రాని పిల్లలు కూడా కథలను శ్రద్ధగా వింటారని, ఇవి వారిలో తెలివి తేటలు పెరగటానికీ తోడ్పడతాయంటే నమ్ముతారా? తాజా అధ్యయనం ఒకటి ఈ విషయాన్నే స్పష్టంగా పేర్కొంటోంది. అమ్మ ఒడిలో ఆడుకునే పిల్లలకూ పుస్తకాలను చదివి వినిపిస్తే నాలుగేళ్ల తర్వాత వారిలో పద సంపద, చదివే నైపుణ్యాలు మెరుగుపడుతుండటం విశేషం. అంటే ప్రాథమిక విద్య ఆరంభించటానికి ముందే పేరు రాసే నైపుణ్యమూ అలవడే అవకాశముందన్నమాట. సుమారు 250 మంది తల్లీబిడ్డల జంటలను శాస్త్రవేత్తలు పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. ఎంత ఎక్కువగా, ఎంత శ్రద్ధగా పుస్తకాలను చదివి వినిపిస్తే అంత ఎక్కువ ఫలితం కనబడుతుంటం గమనార్హం. పసిపిల్లలు కళ్లు తెరచినప్పటి నుంచే తమ చుట్టూరా పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తుంటారు. చూడటం, తాకటం, వినటం వంటి వాటి ద్వారా చాలా విషయాలను నేర్చుకుంటుంటారు. అందువల్ల పుస్తకాలు చదివి వినిపిస్తే ఏడాది లోపు పిల్లలు సైతం పదాలను గ్రహించగలుగుతారని, ఆయా భావాలను అర్థం చేసుకోగలరని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి మంచి పుస్తకాలు చదివి వినిపించటం మేలని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని