అనల్పాహారమే!

ఆలస్యంగా నిద్ర లేవటమో, బడి బస్సుకు సమయం కావటమో.. కారణమేదైనా పిల్లలు తరచుగా టిఫిన్‌ (అల్పాహారం) చేయటం మానేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా హడావుడిలో దీన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది పిల్లల ఎదుగుదలను గణనీయంగా దెబ్బతీస్తుంది.

Published : 03 Oct 2017 01:49 IST

అనల్పాహారమే!

లస్యంగా నిద్ర లేవటమో, బడి బస్సుకు సమయం కావటమో.. కారణమేదైనా పిల్లలు తరచుగా టిఫిన్‌ (అల్పాహారం) చేయటం మానేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా హడావుడిలో దీన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది పిల్లల ఎదుగుదలను గణనీయంగా దెబ్బతీస్తుంది. తరచుగా అల్పాహారం మానేసే పిల్లల్లో ఫోలేట్‌, క్యాల్షియం, ఐరన్‌, అయోడిన్‌ వంటి పోషకాలు లోపిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువగా టిఫిన్‌ చేయటం మానేస్తుండటం గమనార్హం. పోషణలోపంతో పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. ఇది మున్ముందు మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకోవటం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని