యాంటాసిడ్లతో ఆస్థమా ముప్పు!

పిల్లలు ఆస్థమా బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే గర్భధారణ సమయంలో యాంటాసిడ్‌ మందులకు దూరంగా ఉండండి. ఛాతీలో మంట, పులితేన్పుల వంటివి తగ్గటానికి తోడ్పడే ఇలాంటి మందులను వాడిన....

Published : 08 May 2018 01:40 IST

యాంటాసిడ్లతో ఆస్థమా ముప్పు!

పిల్లలు ఆస్థమా బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే గర్భధారణ సమయంలో యాంటాసిడ్‌ మందులకు దూరంగా ఉండండి. ఛాతీలో మంట, పులితేన్పుల వంటివి తగ్గటానికి తోడ్పడే  ఇలాంటి మందులను వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లలకు ఆస్థమా ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. పాంటాప్రొజోల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ వాడకంతో ఆస్థమా ముప్పు 34% పెరుగుతుండగా.. రాన్‌టాక్‌ వంటి హిస్టమిన్‌-2 రిసెప్టార్‌ బ్లాకర్లతో 57% ముప్పు ఎక్కువవుతుండటం గమనార్హం. నిజానికి వీటిని గర్భిణులు సురక్షితంగా వాడుకోవచ్చనే భావిస్తుంటారు. కానీ వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరమని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే వీటిని గర్భిణులకు ఇవ్వచ్చా? లేదా? అనేది నిర్ధరించటానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని