నిలకడ తప్పకుండా

వయసు మీద పడుతున్నకొద్దీ రకరకాల సమస్యలు ముంచుకొస్తుంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, వినికిడి లోపం వంటివి ఇలాంటివే. అయితే పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు గానీ- మన శరీరం నిలకడ (బ్యాలెన్స్‌) తప్పటం కూడా పెద్ద సమస్యే. ఇది తూలి కింద పడి పోవటానికి దారితీస్తుంది.

Published : 13 Dec 2016 01:33 IST

నిలకడ తప్పకుండా

యసు మీద పడుతున్నకొద్దీ రకరకాల సమస్యలు ముంచుకొస్తుంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, వినికిడి లోపం వంటివి ఇలాంటివే. అయితే పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు గానీ- మన శరీరం నిలకడ (బ్యాలెన్స్‌) తప్పటం కూడా పెద్ద సమస్యే. ఇది తూలి కింద పడి పోవటానికి దారితీస్తుంది. దీంతో గాయాలు కావటం, ఎముకలు విరగటం వంటి ముప్పులూ పెరుగుతాయి. నిజానికి మన శరీరం ‘బ్యాలెన్స్‌’ తప్పకుండా నియంత్రించే కీలక యంత్రాంగమంతా లోపలి చెవిలోనే ఉంటుంది. ఇది శరీర కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. మరోవైపు కళ్లు, చర్మం, కండరాలు, కీళ్లు కూడా కదలికల సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంటాయి. మెదడు ఈ సమాచారాన్నంతా సమన్వయం చేసుకుంటూ.. సెరిబెల్లం సాయంతో బ్యాలెన్స్‌ తప్పకుండా చూస్తుంది. అయితే బ్యాలెన్స్‌ను నియంత్రించే చెవిలోని వ్యవస్థ 40 ఏళ్లు దాటిన తర్వాత క్షీణిస్తున్నట్టు తాజాగా బయటపడింది. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ క్షీణత మరింత ఎక్కువవుతున్నట్టూ వెల్లడైంది. ప్రస్తుతం వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టటం మంచిదని సూచిస్తున్నారు. లోపలి చెవి సమస్యలను గుర్తించి, చికిత్స చేయటం.. తూలి పడిపోవటాన్ని నివారించటం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్‌ తప్పకుండా ఉండేందుకు తోడ్పడే వ్యాయామాలు కూడా మేలు చేస్తాయి. శరీర బరువును ఒక వైపు నుంచి మరొక వైపునకు మార్చటం.. ఒక కాలు మీద నిలబడటం.. మడమను కాలి వేళ్లకు ఆనిస్తూ నడవటం.. యోగా వంటివి బాగా ఉపయోగపడతాయి. వీటిని ముందు నుంచే సాధన చేస్తే నిలకడ తప్పే ముప్పును చాలావరకు నివారించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని