వ్యాయామం మంచిదేనా?

కీళ్లనొప్పులు... వినడానికి చిన్న సమస్యలా ఉన్నా ఆ సమస్యతో ఇబ్బంది పడేవారికి మాత్రమే తెలుస్తుంది. అదెంత పెద్ద ఇబ్బందో!

Published : 30 Jan 2018 01:26 IST

నొప్పులు
వ్యాయామం మంచిదేనా?

కీళ్లనొప్పులు... వినడానికి చిన్న సమస్యలా ఉన్నా ఆ సమస్యతో ఇబ్బంది పడేవారికి మాత్రమే తెలుస్తుంది. అదెంత పెద్ద ఇబ్బందో!
చాలామంది కీళ్లనొప్పులు వేధిస్తే.. కదలకుండా మంచానికి పరిమితం అవ్వడమో, వ్యాయామాలు చేస్తే ఆ నొప్పులు ఇంకా బాధిస్తాయనే భ్రమలో వాటికి దూరంగా ఉండటమో చేస్తారు. ఏవో కొన్ని పరిస్థితుల్లో తప్పించి తక్కిన వాటికి వ్యాయామం మేలే చేస్తుందని అంటున్నారు నిపుణులు...
తుంటినొప్పులు, భుజాలనొప్పులు, వెన్ను, మోకాళ్లు, మడమల నొప్పులు.... వంటివి మన ఆనందాలని దోచుకుంటాయి. తోటపని, ఇంటిపని, వంటపని వంటి చిన్నచిన్న పనులు చేసుకోవడానికి కూడా సహకరించవు. కానీ సరైన వ్యాయామాలని సరైన పద్ధతిలో చేస్తే కనుక ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేయడం వల్ల కీళ్ల దగ్గర, వాటి చుట్టూ ఉండే కండరాలు, కండర బంధనాలు బలపడి వాటి కదలికలు సులభంగా జరిగేటట్టు చేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ పరిమితంగా వ్యాయామం చేయడం వల్ల సైనోవియల్‌ ద్రవం విడుదలయి తుంటి, నడుము ప్రాంతాల్లో ఒత్తిడిని తగ్గించి, బిగదీసుకుపోయినట్టుగా ఉండే సమస్య అదుపులోకి వస్తుంది. కీళ్లలో ఉండే సైనోవియల్‌ ద్రవం.. సహజంగా ఆక్సిజన్‌ విడుదల అయ్యేటుట్టు చేసి, ఎముకలకు కావాల్సిన పోషకాలని కూడా అందిస్తుంది. ఓ రకంగా ఈ ద్రవం సహజ నొప్పి నివారిణి అన్నమాట. అదే వ్యాయామం లేకపోతే లిగమెంట్లు ఎక్కడికక్కడ బిగదీసుకుపోతాయి. తుంటి, మోకాళ్లు, నడుము వంటి బరువుపడే ప్రాంతాలకు ఈ ద్రవం రక్షణ కవచంలా పనిచేస్తుంది. అన్నింటికి మించి వ్యాయామం... శరీరం సంతోషంగా ఉండటానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని